విశాఖ నగరం రేసపువానిపాలెంలో పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని, సచివాలయాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బీ. జగదీశ్వరరావు గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. అలాగే ఆరోగ్య విషయాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. అర్హులైన వారందరికీ అడల్ట్ బీసీజీ వ్యాక్సిన్ వేయాలన్నారు.