పొగాకు రహిత సమాజం కోసం కృషి చేయాలని గొలుగొండ మండలం కృష్ణదేవిపేట పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ హరిప్రవీణ్ అన్నారు. బుధవారం పీహెచ్సీ ఆవరణలో పొగాకు రహిత ప్రదేశంపై ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యాధికారి మాట్లాడుతూ.. పొగాకు వల్ల క్యాన్సర్ వంటి ప్రమాదకర వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందన్నారు. కావున పొగాకు అందరూ దూరంగా ఉండాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో పీహెచ్సీ సిబ్బంది పాల్గొన్నారు.