పారదర్శకతే శాసన వ్యవస్థను, న్యాయ, కార్యనిర్వాహక వ్యవస్థలకు భిన్నంగా నిలుపుతోందని ఏపీ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. రాజ్యాంగం, సభ నియమాలు శాసన వ్యవస్థ పనితీరులో దాపరికానికి తావు లేకుండా చేశాయనీ, ప్రజలు చట్టసభ కార్యకలాపాలను పరిశీలించి, తమ అభిప్రాయాలు వెల్లడించేందుకు అవకాశం కల్పించాలన్నారు. ఆస్ట్రేలియాలోని సిడ్నీలో జరుగుతున్న 67వ కామన్వెల్త్ మహాసభలో బుధవారం ఆయన ఉపన్యాసం చేశారు.