మాడుగుల: ప్రజా ప్రతినిధులను సమన్వయపరచుకోండి: ఎమ్మెల్యే
అధికారులు కానీ సిబ్బంది కానీ గ్రామాలలో సర్పంచ్లను ఎంపీటీసీలను ఇతర ప్రజాప్రతినిధులను సమన్వయ పరుచుకుంటూ ప్రభుత్వ కార్యక్రమాలు చేపట్టాలని స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి సూచించారు. శనివారం మాడుగుల మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ రాజారాం అధ్యక్షతన జరిగిన మండల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ముఖ్యంగా సర్పంచ్లకు ఎంపీటీసీలకు చెప్పకుండా గ్రామాల్లో ఏ కార్యక్రమం చేపట్టవద్దన్నారు.