మాడుగుల మండలం కేజే పురం పశు వైద్యశాలలో శనివారం మధ్యాహ్నం ప్రమాదవశాత్తు స్వల్ప అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో కొద్దిగా ఫర్నిచర్ టేబుల్, కృత్రిమ గర్భ దారణ ఇంజక్షన్లు నిల్వ చేసే కంటైనర్ ద్వంసం అయ్యాయి. అదృష్టవశాత్తు ఎటువంటి ప్రాణ నష్టం గానీ, రికార్డులకు కానీ నష్టం కాలేదని కె. జె. పశు వైద్యాధికారి డా. మణి లక్ష్మణ్ తెలియజేశారు.