జగ్గంపేట: నిబంధనలు పాటించని బాణసంచా దుకాణదారులు

66பார்த்தது
జగ్గంపేట: నిబంధనలు పాటించని బాణసంచా దుకాణదారులు
జగ్గంపేటలోని గోకవరం రోడ్డు శివారులో ఏర్పాటు చేసిన దీపావళి సామాన్ల షాపు యజమానులు అమ్మకాలకు సంబంధించి నిబంధనలు పాటించడం లేదని ప్రజా సంఘం నాయకులు ఆరోపించారు. నిబంధనలకు విరుద్ధంగా టార్పాలిన్లు, ప్లాస్టిక్ కవర్లతో షాపులను ఏర్పాటు చేసారని అన్నారు. దీంతోపాటు, చిన్నపిల్లలతో పనులు చేయిస్తున్నారని, షాపులకు అనుమతి లేకుండా అమ్మకాలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ అంశంపై అధికారులు వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు.

தொடர்புடைய செய்தி