గాజువాక 60 అడుగుల రోడ్డులో ఉన్న ఎస్. ఎస్ ఫిట్నెస్ వరల్డ్ జిమ్ ను జీవీఎంసీ అధికారులు బుధవారం సీజ్ చేశారు. రెండేళ్ల నుంచి ట్రేడ్ లైసెన్స్ కట్టకపోవడం వల్ల పోలీసుల సహాయంతో సీజ్ చేసినట్లు జీవీఎంసీ అధికారులు తెలిపారు. ట్రేడ్ లైసెన్స్ తప్పనిసరిగా కట్టాలని లేకపోతే సీజ్ చేస్తామని అధికారులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జివిఎంసి సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు.