విశాఖలోని సిరిపురం జంక్షన్లో నిర్మిస్తున్న మల్టీ లెవెల్ కార్ పార్కింగ్, కమర్షియల్ కాంప్లెక్స్ ను వీఎంఆర్డీఏ మెట్రోపాలిటన్ కమిషనర్ కె. ఎస్. విశ్వనాథన్ బుధవారం పరిశీలించారు. నవంబర్‌లోగా పనులు పూర్తికావాలని ఆదేశించారు. అనంతరం సమావేశ మందిరంలో జరిగిన ప్రణాళికా విభాగపు సమీక్షా సమావేశంలో పాల్గొని పెండింగ్ కోర్టు కేసులకు సంబంధించి సత్వరమే కౌంటర్స్ ఫైల్ చేయాలని ఆదేశించారు.