హుకుంపేట మండలంలోని మారెల ఘాట్ రోడ్డుకు మరమ్మత్తులు చేపట్టాలని గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు. మూడు సంవత్సరాల క్రితం నిర్మించిన తారురోడ్డు శిథిలావస్థకు చేరి రహదారిపై రాళ్లు తేలిపోయి అద్వానంగా తయారవడంతో వాహనదారులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ప్రమాదాల బారిన పడుతున్నారని వాహనదారులు వాపోతున్నారు. సంబంధిత ఆర్ అండ్ బి అధికారులు స్పందించి మారెల ఘాట్ రోడ్డుకు మరమ్మత్తులు చేపట్టాలని కోరుతున్నారు.