అనంతగిరి: కొండిబ పంచాయతీ డుంబ్రిగుడ గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలని గిరిజనులు బుధవారం డిమాండ్ చేశారు. తమ గ్రామానికి 20 కుటుంబాలు 82 మంది నివసిస్తు జీవిస్తున్నామని తెలిపారు. నిత్యవసర సరుకుల కోసం కాలీ బాటలోనే రాకపోకలు కొనసాగిస్తున్నామని ఆరోగ్య సమస్యలు తలెత్తినప్పుడు డోలిమోతలకే శరణ్యమైన దుస్థితి ఏర్పడుతుందని తెలిపారు. అధికారులు చొరవ తీసుకొని గ్రామానికి 2 కిలోమీటర్లు రోడ్డు సౌకర్యాన్ని కల్పించాలని కోరారు.