అనంతగిరి మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం పంచాయతీ కార్యదర్శులకు ఎకో ఫ్రెండ్లీ టూరిజం, పారిశుద్ధ్యంపై ఎంపీడీవో కుమార్ సమీక్ష నిర్వహించారు. పర్యాటక ప్రాంతాలలో పారిశుధ్యంపై పంచాయితీ కార్యదర్శులు దృష్టి పెట్టి ప్లాస్టిక్ నివరించి రిసార్ట్స్, హోటల్స్, కిరాణా షాపుల్లో డస్ట్ బిన్లు ఏర్పాటు చేయాలని సూచనలు అందించారు. పర్యాటక ప్రాంతాలలో పారిశుధ్యం మరింత మెరుగుపర్చేందుకు అదనపు పారిశుధ్య కార్మికులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.