మళ్లీ గడపారా పట్టిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖ ల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు రూటే సెపరేటు. మాస్ కి మాస్.. క్లాస్ కి క్లాస్ అన్నట్లుగా ఆయన ప్రవర్తిస్తూ ఉంటారు. ప్రజల్లో ఇట్లే కలిసిపోతారు. ప్రజల కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటారు. ఇదే తరహాలో పల్లె ప్రగతి కార్యక్రమాల్లో కూడా మంత్రి పల్లె ప్రజలతో మమేకం అవుతున్నారు. తాజాగా బుధ‌వారం వరంగల్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం రాయపర్తి మండలం కాట్రపల్లి లో పల్లె ప్రగతి లో పాల్గొనడానికి బుధవారం బయలు దేరారు. జనగామ జిల్లా లింగాల ఘనపురం మండలం చీటూరు గ్రామం వద్ద రోడ్ల కు ఇరువైపులా మొక్కలు నాటేందుకు ఉపాధి హామీ కూలీలు గుంటలు తీసుకున్నారు. వెంటనే తన వాహనం అపిన మంత్రి ఆ కూలీలతో కలిసి గుంటలు తీశారు. గడ్డపార వేసి, మట్టిని తవ్వారు. అలాగే కొద్దిసేపు కూలీలతో మాట్లాడారు. కూలీ ఎంత పడుతున్నది? పనులు సాగుతున్నాయా? వంటి పలు ప్రశ్నలు వేశారు. అందుకు వాళ్ళు సంతృప్తిని వ్యక్తం చేశారు. అలాగే మంత్రి వారికి కుశల ప్రశ్నలు వేసి, మాట్లాడి, సంతోష పెట్టారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி