రేపు మంత్రి బండి సంజయ్ సమీక్షకు అధికారులు హాజరు కావాలి

ములుగు జిల్లా కలెక్టరేట్ లో సోమవారం కన్నాయిగూడెం మండలం ఆస్పిరేషనల్ బ్లాక్ కార్యక్రమంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారని ములుగు జిల్లా కలెక్టర్ దివాకర ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం ఉదయం 10-30 గంటలకు అధికారులు సంబంధిత సమాచారంతో హాజరుకావాలని కోరారు. అనంతరం మంత్రి సంజయ్ వెంకటాపూర్ మండలం నందిపహాడ్ గ్రామాన్ని సందర్శిస్తారని అన్నారు.

தொடர்புடைய செய்தி