ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేట గ్రామంలో ఉన్న ప్రపంచ ప్రసిద్ధి పొందిన యునెస్కో వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన రామప్ప దేవాలయాన్ని ఆదివారం హైకోర్టు జడ్జి సుజయ్ పాల్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వారికి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం రామలింగేశ్వర స్వామికి పూజలు నిర్వహించారు. టూరిజం గైడ్ విజయ్ కుమార్ ద్వారా ఆలయ చరిత్ర, చారిత్రక విశేషాలు, శిల్పకళా నైపుణ్యాల గురించి అడిగి తెలుసుకున్నారు.