నర్సింహులపేట మండలం వస్రం తండా సమీపంలో శనివారం నాగసాధు అఘోరీ సంచరించారు. ఖమ్మం వైపు వెళుతూ మార్గం మధ్యలో అక్కడ రోడ్డు పక్కన ఆగి వెంట తెచ్చుకున్న విభూది ధరించి పూజలు చేసినట్టు స్థానికులు తెలిపారు. గురువారం వరంగల్ భద్రకాళి అమ్మవారి ని దర్శించుకొని సందడి చేసిన అఘోరీ శనివారం ఉదయం తిరిగి ఖమ్మం వైపు వెళుతూ కనిపించారు.