మహబూబాబాద్: అట్రాసిటీ కేసులను త్వరితగతిన పరిష్కరించాలి

ఎస్సీ, ఎస్టీ సమస్యలు పరిష్కరించి వారి అభ్యున్నతికి కృషి చేయాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. మహబూబాబాద్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో భూ సమస్యలు, అట్రాసిటీ కేసుల పై బుధవారం జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను త్వరితగతిన పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని సూచించారు.

தொடர்புடைய செய்தி