డోర్నకల్ మండలం ముల్కలపల్లి గ్రామంలో గురువారం రాత్రి దీపావళి పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. గ్రామంలో ప్రతీ వీధి దీపాలతో కలకలలాడుతోంది. ప్రతీ గల్లీ టపాసుల మోతలతో దద్దరిలింది. పెద్దలు, పిల్లలు టపాసులను కాలుస్తూ సందడి చేశారు. దీనితో గ్రామంలో సందడి వాతావరణం నెలకొని పండుగలా మారింది. ఈ వేడుకలలో ప్రజలు, యువత తదితరులు పాల్గొన్నారు.