పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో సోమవారం స్మృతి పరేడ్ కార్యక్రమంలో అమరవీరుల స్థూపానికి పూలమాల వేసి కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్ ఖారే నివాళులు అర్పించారు. రక్తదాన శిబిరంలో జిల్లా ఎస్పీ పాల్గొని రక్త దానం చేశారు. ప్రజల కోసం పోరాటంలో ప్రాణాలు వదిలిన పోలీసు అమరవీరులను ఎప్పటికీ స్మరించుకుంటామని, వారి కుటుంబాలకు ప్రభుత్వం తరఫున అండగా ఉంటామన్నారు.