కేంద్ర సహాయ మంత్రి, మలయాళ సినీ స్టార్ సురేశ్ గోపిపై కేరళ పోలీసు కేసు నమోదు చేశారు. నిర్లక్ష్యంగా వాహనాన్ని నడిపారని, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించారని, అంబులెన్స్‌ను దుర్వినియోగం చేశారని పేర్కొంటూ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో త్రిస్సూర్‌లో జరిగిన వేడుకకు సురేశ్ గోపి అంబులెన్స్ లో హాజరుకావటం వివాదాస్పదమైంది. దీనిపై ఓ కమ్యూనిస్ట్ నాయకుడు కేరళ పోలీసులకు ఫిర్యాదు చేశారు.