TG: జన్వాడ కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. అయితే రాజ్ పాకాల, విజయ్ మద్దూరి నిన్న విచారణకు హాజరు కాలేదు. పార్టీ జరిగిన రోజు విజయ్ మద్దూరి తన ఫోన్ బదులు వేరే మహిళ ఫోన్ను పోలీసులకు ఇచ్చారు. అయితే ఆ మహిళా తన ఫోన్ ఇవ్వాలంటూ మోకిల ఠాణా పోలీసులను ఆశ్రయించింది. దీంతో పోలీసులు ఆమె స్టేట్మెంట్ రికార్డు చేయనున్నారు. కేసు కోర్టు పరిధిలో ఉన్నందున కోర్టు అనుమతి తర్వాత ఫోన్ను ఇస్తామని వెల్లడించారు.