సిరిసిల్లలో మెగా రక్తదాన శిబిరం

పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా శనివారం సిరిసిల్ల పట్టణంలోని పద్మనాయక ఫంక్షన్ హాల్ లో ఉదయం 10గంటలకు మెగా రక్తదాన శిబిరాన్ని కలెక్టర్ సందీప్ కుమార్ ఝతో కలిసి ఎస్పి అఖిల్ మహాజన్ ప్రారంభించారు. ఈ రక్తదాన శిబిరానికి అధిక సంఖ్యలో పోలీసు సిబ్బంది, ప్రజలు హాజరయ్యారు. అధిక సంఖ్యలో రావడంతో సందడి వాతావరణం నెలకొంది. రక్తదాన శిబిరంలో పాల్గొన్న వారికి ప్రశంస పత్రాలు అందజేసి కలెక్టర్, ఎస్పి అభినందించారు.

தொடர்புடைய செய்தி