పెద్దపల్లి మండలం దేవునిపల్లి శ్రీలక్ష్మీ నృసింహస్వామి జాతరలో లడ్డూ ప్రసాదం, కొబ్బరికాయలు అమ్మకం దుకాణాల ఏర్పాటుకు గురువారం టెండర్లు ఖరారు చేశారు. లడ్డూ ప్రసాదం దుకాణానికి రూ. 3 లక్షల 86 వేల 700 కాగా, కొబ్బరికాయలు దుకాణం కోసం రూ. 1లక్ష 51 వేలకు ఖరారు చేశారు. టెండర్ వేలంలో ఎండోమెంట్ ఇన్స్పెక్టర్ సుజాత, ఆలయ ఈఓ శంకరయ్య, ఆలయ ప్రధాన అర్చకులు లక్ష్మీనరసింహచార్యులు, శ్రీకాంతచార్యులు పాల్గొన్నారు.