సీడ్ కంపెనీని ఆకస్మికంగా తనిఖీ చేసిన కరీంనగర్ సిపి

కరీంనగర్ జిల్లా మానకొండూరు మండల కేంద్రంలో సిందూర్ సీడ్ కంపెనీని కరీంనగర్ సీపీ సుబ్బారాయుడు సోమవారం తనిఖీ చేశారు. రైతులు విత్తనాలు కొనేటప్పుడు మాత్రం నకిలీ విత్తనాలు కొనకుండా జాగ్రత్త పడాలని, రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని కోరారు. రైతులు విత్తనాలు కొనేటప్పుడు వ్యవసాయ అధికారులను సంప్రదించి, ప్రభుత్వ అనుమతి ఉన్న విత్తనాలను మాత్రమే కొనుగోలు చేయాలని కోరారు. నకిలీ విత్తనాలు అమ్మే వారు గ్రామాలలో కనిపించినట్లయితే దగ్గర్లో ఉన్న పోలీసు అధికారులకు సమాచారం అందించినట్లయితే వారిపై పిడి యాక్ట్ నమోదు చేస్తామని తెలిపారు. వీరి వెంట జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాస్, టాస్క్ ఫోర్ట్స్ ఏసీపీ విజయ సారధి, సీఐ సృజన్ రెడ్డి , మానకొండూర్ సీఐ రాజ్ కుమార్, మండల వ్యవసాయ అధికారి శ్రీనివాస్ రెడ్డి, టాస్క్ ఫోర్స్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி