భూమికోసం తల్లిని కొట్టి చంపిన కుమారుడు

నవ మాసాలు మోసి, కని పెంచిన తల్లిని భూమి కోసం పారతో కొట్టి చంపిన ఘటన బుధవారం ఉదయం కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకుంది. తిమ్మాపూర్ మండలం రేణికుంట గ్రామనికి చెందిన తమ్మనవేణి కనకవ్వకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కనకవ్వ పేరు మీద ఉన్న రెండు ఎకరాల వ్యవసాయ భూమిని తన పేరుమీద చెయ్యాలని తల్లి కనకవ్వ పని చేస్తుండగా కొడుకు గొడవ పెట్టుకుని అక్కడే ఉన్న పారతో కొట్టి చంపి పారిపోయాడు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி