మానకొండూరు నియోజకవర్గం లోని తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్ గ్రామ పంచాయితీ ISO 9001 సర్టిఫికేషన్ సాధించింది. అభివృద్ధి లో నుస్తులాపూర్ అత్యున్నత ప్రమాణాలు పాటిస్తున్నందుకుగాను గ్రామ పంచాయితీ ISO 9001 సర్టిఫికెట్ పొందింది. మంత్రి గంగుల కమలాకర్ చేతులమీదుగా సర్టిఫికెెట్ ను నుస్తులాపూర్ సర్పంచ్ రావుల రమేష్ అందుకున్నారు. కరీంనగర్ జిల్లా నుండి ISO 9001 సర్టిఫికెట్ పొందిన గ్రామపంచాయితీగా నుస్తులాపూర్ స్థానం సంపాదించింది. పంచాయితీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ ఆద్వర్యంలో రాష్ట్రంలో అభివృద్ధిలో అత్యున్నత ప్రమాణాలు పాటిస్తున్న గ్రామ పంచాయితీ గా నుస్తులాపూర్ పంచాయితీ గుర్తింపు పొంది ISO 9001 సర్టిఫికెట్ ను సాధించింది. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా గురువారం కరీంనగర్ లోని జిల్లా పరిషత్ కార్యాలయంలో మంత్రి గంగుల కమలాకర్ ఈ సర్టిఫికెట్ ను నుస్తులాపూర్ సర్పంచ్ రావుల రమేష్ కి అందజేశారు.
ఈ కార్యక్రమంలో సుడా ఛైర్మెన్ జీ వి రామకృష్ణ రాావు, జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్, జడ్పీ చైర్మన్ కనుమల్ల విజయ, ఎంపీపీ వనిత -దేవేందర్ రెడ్డి, ఉప సర్పంచ్ బెెెతి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీడీవో రవీందర్ రెడ్డి తదితరులు పాల్గోన్నారు.