హుజురాబాద్: కేటీఆర్‌ను డ్రగ్స్‌ కేసులో ఇరికించే కుట్ర: కౌశిక్‌రెడ్డి

కేటీఆర్ బంధువు ఇంట్లో జరిగిన రేవ్ పార్టీ రాజకీయాల్లో సంచలనం రేపిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మంగళవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి డైరెక్షన్‌లో జరిగిన డ్రామా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ ను డ్రగ్స్ కేసులో ఇరికించేందుకు కుట్ర చేశారని తీవ్ర ఆరోపణలు చేశారు. నిజానికి ప్రభుత్వ టార్గెట్ రాజ్ పాకాల కాదని, కేటీఆర్ అని వెల్లడించారు.

தொடர்புடைய செய்தி