కాగజ్‌నగర్‌ లో వైద్యుల ర్యాలీ

పశ్చిమ బెంగాల్ రాజధాని కలకత్తాలో ట్రైనీ వైద్యురాలిపై జరిగిన లైంగికదాడి, హత్య ను ఖండిస్తూ ఐఎంఏ దేశవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది. శనివారం కాగజ్‌నగర్‌లో ఐఎంఏ డాక్టర్లు, ఆర్ఎంపి, పీఎంపిలతో కలిసి తిరందాజ్ నుండి రాజీవ్ చౌక్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా డాక్టర్లు మాట్లాడుతూ అత్యాచారం, హత్య చేసిన నిందితులని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

தொடர்புடைய செய்தி