ఎల్లారెడ్డి శివారులో నిర్మాణాలు పూర్తి చేసుకుని చివరి దశలో ఉన్న డబుల్ బెడ్ రూం గృహాల మౌళిక వసతుల పనులను, బుధవారం ఆర్డీఓ ప్రభాకర్, మున్సిపల్ చైర్మన్ పద్మశ్రీకాంత్, కమిషనర్ శ్రీహరి, పీఆర్. డీఈ గిరి, డీఈ సంతోష్, ఏఈ వినోద్ లతో కలిసి పరిశీలించారు. అర్హులైన లబ్ధిదారులకు పంపిణీ కోసం సిద్దం చేయడానికి ఎమ్మెల్యే మదన్ మోహన్ ఆదేశాల మేరకు అసంపూర్తి పనులను పరిశీలించి, పనుల వేగం పెంచేలా చేశాం అని ఆర్డీఓ అన్నారు.