కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం దేశాయిపేటలో ఉన్న ఎస్.ఆర్.ఎన్.కె. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగు అధ్యాపకులుగా సేవలందించిన వెంకట్రావు దీక్షితులు పదవీ విరమణ చేశారు. సోమవారం కళాశాలలో ఈ సందర్భంగా ప్రత్యేక పదవీ విరమణ మహోత్సవం నిర్వహించగా, ప్రిన్సిపాల్, ఇతర అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. అందరూ ఆయన సేవలను ప్రశంసిస్తూ మంచి భవిష్యత్తు కోసం శుభాకాంక్షలు తెలియజేశారు.