ప్రజా సమస్యలను తెలుసుకుని ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నామని బహదూర్పురా ఎమ్మెల్యే మహ్మద్ మూబిన్ అన్నారు. ఆదివారం ఎంఐఎం పార్టీ కార్యాలయంలో వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు ఎమ్మెల్యేను కలిశారు. వారి సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. సంబంధిత అధికారులతో చర్చించి సమస్యలను పరిష్కరిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఎలాంటి సమస్యలు ఉన్నా కార్పొరేటర్ల ద్వారా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు.