మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిజం బయటకు రావాలని ఈ కేసులో అప్రూవర్ దస్తగిరి తెలిపారు. మంగళవారం కడపలో దస్తగిరి మాట్లాడుతూ.. తాను 2023 అక్టోబర్ 23వ తేదీన జైలుకు వెళ్లడం జరిగిందని, వివేకా హత్య కేసులో నిందితుడైన శంకర్ రెడ్డి కుమారుడు చైతన్య రెడ్డి బెదిరించారన్నారు. గత ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ కి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. ఎస్పీ హర్షవర్ధన్ రాజును కలిసి ఫిర్యాదు చేస్తానన్నారు.