రాష్ట్రంలో ఉచిత ఇసుక విధానం ఉత్తిదే: తులసి రెడ్డి

రాష్ట్రంలో ఉచిత ఇసుక విధానం ఉత్తిదే, ఇసుక బంగారంగా మారిందని ఏపీసీసీ మీడియా చైర్ మెన్ తులసి రెడ్డి ఎద్దేవా చేశారు. బుధవారం వేంపల్లెలో ఆయన మాట్లాడుతూ. సీనరేజీ ఛార్జీలు, జీఎస్టీ, లోడింగ్ ఛార్జీలు, రవాణా ఛార్జీలు అన్నీ కలిపి తడిసి మోపెడవుతున్నాయన్నారు. గతంలో ట్రాక్టర్ ఇసుక రూ. 3వేలకు దొరికేదని, ఇప్పుడు రూ. 5వేలు అయిందన్నారు. ఇసుక అందుబాటులో లేకపోవడంతో నిర్మాణరంగం స్తంభించిపోయింది అన్నారు.

தொடர்புடைய செய்தி