నందిగాం మండలం పెంటూరు గ్రామంలో సర్పంచ్ ప్రతినిధి జడ్యాడ జయరాం ఆధ్వర్యంలో జగనన్న లేఅవుట్ లో మంగళవారం విద్యుత్ సౌకర్యం కల్పించారు. ఎస్సీ కాలనీకి ఆనుకొని ఉన్న జగనన్న లేఔట్లో మొత్తం అన్ని విద్యుత్ స్తంభాలకు వైర్లు వేసి విద్యుత్తు దీపాలు బిగించారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.