ఈనెల 29 చలో శ్రీకాకుళం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని దళిత ఐక్య వేదిక జిల్లా అధ్యక్షుడు సాకేటి నాగరాజు సోమవారం పిలుపునిచ్చారు. ఈ మేరకు జి. సిగడాం మండలం చీడిపేటలో వర్గీకరణ రద్దు చేయాలని గోడ పత్రికలను విడుదల చేశారు. వర్గీకరణకు వ్యతిరేకంగా మాలలందరు ఐక్యం కావాలన్నారు. ఈ కార్యక్రమంలో వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నాయకులు కళ్ళేపల్లి రాంగోపాల్, రమేష్, భూపతి, జానకిరామ్ తదితరులు పాల్గొన్నారు.