పురుషులతో పాటు సమానంగా మహిళలను గౌరవించాలని తహసీల్దార్ రామారావు, ఎంపీడీవో అప్పలనాయుడు పిలుపునిచ్చారు. జలుమూరు మండల కేంద్రంలో సోమవారం జెండర్ ఆధారిత హింసకు వ్యతిరేకంగా నిర్వహించిన ర్యాలీలో వారు పాల్గొన్నారు. ప్రభుత్వాలు కూడా మహిళలకు అన్ని రంగాలలో సమాన హక్కులను కల్పించడం జరుగుతుందని, దీనిని మరింత అమలు చేసేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు.