పాతపట్నం: విద్యుత్ చార్జీలను అమాంతం పెంచేసిన కూటమి ప్రభుత్వం

రాష్ట్రంలో విద్యుత్ చార్జీలు పెంచమని, అవసరమైతే కరెంటు ఛార్జీలు తగ్గిస్తామని చెప్పిన సీఎం చంద్రబాబు నాయుడు నేడు అమాంతం పెంచేసారని మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి విమర్శించారు. సోమవారం సాయంత్రం పాతపట్నం మండల వైసీపీ కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ దీపావళి నుంచి విద్యుత్ చార్జీల పెంపు, అక్రమ ఇసుక తరలింపు, ప్రైవేటు మద్యం షాపులు వంటి అంశాలపై ఆమె అసహనం వ్యక్తం చేశారు. వీటిని ప్రజలు గమనిస్తున్నారన్నారు.

தொடர்புடைய செய்தி