లావేరు: వేగవంతంగా ఉపాధి పనులు పూర్తి చేయండి

ఉపాధి హామీ పథకం మెటీరియల్ కాంపోనెంట్ పనులు వేగవంతం చేయాలని డ్వామా పిడి బి సుధాకర్ రావు సిబ్బందిని ఆదేశించారు. మంగళవారం లావేరు మండలం బుడుమూరులో జరుగుతున్న సిమెంట్ రహదారి పనులను ఆయన పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా రూ. 238. 6 కోట్ల నిధులతో సిమెంట్ రహదారులు పనులను యుద్ధ ప్రాతిపదికగా చేపడుతున్నామని, గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ఉపాధి హామీ పథకం నిధులు ఎంతో ఉపయోగ పడుతున్నాయని అన్నారు.

தொடர்புடைய செய்தி