పొన్నూరు: ప్రొఫెసర్ సాయిబాబా మృతికి సంతాపం

ఉపా వంటి నల్ల చట్టాలకు వ్యతిరేకంగా అలుపెరగని పోరాటం చేసిన ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ సాయిబాబా మృతి తీరని లోటని మానవ హక్కుల వేదిక కన్వీనర్ జిఎస్ రాయల్ అన్నారు. ఆదివారం పొన్నూరు లోని కార్యాలయంలో సభ్యులు ఆయన మృతికి సంతాపంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మృతికి సంతాపంగా మౌనం పాటించి ఆయన ఆశయాలను కొనసాగిస్తామని ప్రతిన పూనారు. శ్రీనివాస్, మస్తాన్రావు, వెంకటేశ్వర్లు ఆనంద్, సునీల్ పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி