లింగ వివక్షను ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని జిల్లా కలెక్టర్ జె. వెంకట్ మురళి తెలిపారు. జాతీయ స్థాయి జెండర్ ప్రచారంలో భాగంగా రూపొందించిన వాల్ పోస్టర్ ను కలెక్టరేట్ ఆవరణలో కలెక్టర్ సోమవారం ఆవిష్కరించారు.
మహిళలకు పని ప్రదేశాలలో రక్షణ కల్పించాలని అన్నారు. ఈ నెల 25 నుంచి డిసెంబర్ 23వ తేదీ వరకు లింగ వివక్షకు వ్యతిరేకo గా ప్రచార కార్యక్రమాలను ప్రభుత్వం నిర్వహిస్తుందన్నారు.