ఆహార పదార్థాలలో కల్తీకి పాల్పడితే కఠిన చర్యలు

ఆహార పదార్థాలలో కల్తీకి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఫుడ్ సేఫ్టీ అధికారి పి ప్రణీత్ కుమార్ అన్నారు. ఫుడ్ సేఫ్టీపై మంగళవారం ఇంకొల్లు వాసవి కన్యకా పరమేశ్వరి కళ్యాణ మండపంలో వ్యాపారులకు ఆహార భద్రత పై శిక్షణా కార్యక్రమం జరిగింది. ప్రణీత్ కుమార్ మాట్లాడుతూ వినియోగదారులకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలన్నారు. కల్తీ ఆహారం ద్వారా ఏ వ్యక్తికైనా ప్రాణహానీ జరిగితే రూ. 10 లక్షల జరిమానా విధిస్తామని ఆయన చెప్పారు.

தொடர்புடைய செய்தி