అటవీ అమరవీరులను స్మరించుకుంటూ వారి త్యాగాలను గౌరవిద్దాం అని వేంపల్లె అటవీశాఖ రేంజ్ అధికారి పి. బాల సుబ్రమణ్యం కోరారు. ఆదివారం రాష్ట్ర అటవీ అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా వేంపల్లి ఫారెస్టు కార్యాలయంలో వారి చిత్రపటాలకు పూలమాలతో ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి మానవత స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు పోతిరెడ్డి శ్రావణ్, ప్రాంతీయ ఛైర్మన్ చల్లా బాలాజీ పాల్గొని అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు.