ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి వచ్చిన అర్జీలు పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు పరిశీలించి పరిష్కరించాలని యాదాద్రి జిల్లా కలెక్టర్ హనుమంత్ కే. జండగే జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో వివిధ ప్రాంతాల ప్రజల నుండి 35 ఆర్జీలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గంగాధర్, జిల్లా రెవిన్యూ అదనపు కలెక్టర్ పాల్గొన్నారు.