యాదగిరిగుట్ట పట్టణంలో డీ. సీ. సీ. బీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి శనివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాదగిరిగుట్టలో సీఎం రేవంత్ పర్యటన ఉపయోగం లేనిది అని అన్నారు. వైటీడీఏ అధికారులు కేసీఆర్ 95శాతం పనులకు రూ. 1200కోట్లు ఖర్చు చేసిన అంశాలను ప్రజంటేషన్ చేశారు. రూ. 300కోట్లు కేటాయిస్తే పనులు పూర్తి అవుతాయని అధికారులు చెబితే సీఎం రేవంత్ కనీసం నోరు కూడా తెరవలేదన్నారు.