తెలంగాణ గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష వాయిదా వేస్తే వచ్చే నష్టమేంటని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు. అభ్యర్థుల్ని నిర్బంధిస్తూ పరీక్షలు నిర్వహించడం అవసరమా? అని అన్నారు. వారికి న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని తెలిపారు. కేంద్రమంత్రి బండి సంజయ్ పొలిటికల్ జోకర్‌గా మారారని విమర్శించారు. మోదీకి ముగ్గురు తమ్ముళ్లని, పెద్దోడు రేవంత్, నడిపోడు బండి, చిన్నోడు అరవింద్ అని ఎద్దేవా చేశారు.