ఉపాధ్యాయ మరియు ప్రభుత్వ విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం యూఎస్పీసీ, జేఏసిటిఓ ఆధ్వర్యంలో ఈ నెల 29న హైదరాబాద్ లోని ధర్నాచౌక్ (ఇందిరా పార్కు) వద్ద జరిగే మహాధర్నాను విజయవంతం చేయాలని టీఎస్యూటీఎఫ్ జిల్లా ప్రధానకార్యదర్శి సిహెచ్ రఘుపతిరెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం పర్వతగిరి మండలంలోని కొంకపాక ప్రాథమిక పాఠశాలలో మహాధర్నా పోస్టర్ ఆవిష్కరణ యూఎస్పీసీ, జేఏసిటీఓ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా రఘుపతిరెడ్డి మాట్లాడుతూ.. గత కొంత కాలంగా పదోన్నతులు కల్పించకపోవడం వలన అర్హతలు కలిగిన అనేక మంది ఉపాధ్యాయులు అదే క్యాడర్ లో ఉద్యోగ విరమణ పొందుచున్నారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో టీఎస్యూటీఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు మేకిరి దామోదర్, జిల్లా కార్యదర్శులు సీఎస్ఆర్ మల్లిక్, శ్రీనివాస్, టీపీటీఎఫ్ జిల్లా కార్యదర్శి సిహెచ్ రాజలింగం, డీటీఎఫ్ జిల్లా కార్యదర్శి రామస్వామి, టీపీటీఎఫ్ మండల అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు రత్నం, శ్రీనివాస్, డీటీఎఫ్ మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నాగేశ్వర్ రావు, రాజు, టీఎస్యూటీఎఫ్ మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు తిరుపతిరెడ్డి, కరుణాకర్, పాక శ్రీనివాస్, సీతారాం ప్రసాద్, రాజిరెడ్డి, నీలాద్రి, రాజగోపాల్ తదితరులు పాల్గొన్నారు.