ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాలోజీ కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరవుతుండగా ఆయన కాన్వాయ్ ను కొడంగల్ లో గిరిజన రైతులపై పెట్టిన కేసులను వెనక్కి తీసుకోవాలని సేవాలాల్ సేన హన్మకొండ మరియు వరంగల్ జిల్లా అధ్యక్షులు కునుసోతు మురళి నాయక్ అడ్డుకున్నారు. అనంతరం పోలీసులు వారిని అదుపులో తీసుకుని కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ కి తరలించడం జరిగింది.