మహిళల అభివృద్ధితోనే సమాజం అభివృద్ధి చెందుతుందని కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని మంగళవారం హన్మకొండ సభలో పాల్గొన్న మంత్రి సీతక్క పేర్కొన్నారు. ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా మహిళలను అత్యుత్తమ వ్యాపారం వ్యక్తులుగా తీర్చిదిద్దుతున్నామన్నారు. మహిళల సంక్షేమంతోనే అభివృద్ధి చెందుతుందని ఈ సత్యాన్ని గమనించే ప్రభుత్వం మహిళల అభ్యున్నతికి పెద్ద పీఠ వేస్తున్నదన్నారు.