అంగరంగ వైభవంగా లక్ష్మినరసింహస్వామి కళ్యాణం

70பார்த்தது
పాలకుర్తి నియోజకవర్గ పరిధిలోని రాయపర్తి మండలం తిర్మలాయపల్లి గ్రామంలో అంగరంగ వైభవంగా స్వయంభు శ్రీ లక్ష్మీనరసింహస్వామి కళ్యాణం నిర్వహించారు. గురువారం స్థానిక శ్రీ లక్ష్మి నరసింహస్వామి ఆలయంలో నిర్వహించిన ఈ కల్యాణ మహోత్సవ కార్యక్రమంలో వేద పండితులు పలు ప్రత్యేక పూజలు, కల్యాణ వేడుకలు నిర్వహించారు. అనంతరం భక్తులకు ఆశీర్వచనం అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.