హనుమకొండ-హైదరాబాద్ రూటులో ఆర్టీసీ డీలక్స్ బస్సులలో ప్రయాణించిన మహిళా ప్రయాణికులకు లక్కీ డ్రా ద్వారా బహుమతులను అందజేస్తున్నట్లు వరంగల్ ఆర్టీసీ డిప్యూటీ రీజినల్ మేనేజర్ (ఎం)మాధవరావు తెలిపారు. హనుమకొండ బస్టాండ్ లో మంగళవారం సాయంత్రం హనుమకొండ ఆర్టిసి డిపో మేనేజర్ భూక్యా ధరంసింగ్ సింగ్ ఆధ్వర్యంలో డ్రా తీసి ఎం రమ, చేతి లలిత, ఎం పద్మలు బహుమతులు పొందినట్లు ప్రకటించారు.