కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు కార్మిక కోడ్లను సత్వరమే రద్దు చేసి కార్మికవర్గ సమస్యలు పరిష్కరించాలని మంగళవారం ఏఐఎఫ్ టీయూ (న్యూ) రాష్ట్ర అధ్యక్షుడు ఎం. మల్లేశం డిమాండ్ చేశారు. వరంగల్ జిల్లా నర్సంపేట ద్వారకపేట రైసుమిల్లుల్లో జరిగిన ఆ సంఘం కార్మికుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మోదీ సర్కార్ కార్పొరేట్, బహుళజాతి కంపెనీలకు వత్తాసు పలుకుతూ దేశ సంపదను, ప్రభుత్వ రంగ సంస్థలను వారికి ధారాదత్తం చేస్తుందన్నారు.